- రికార్డు స్థాయి నుంచి స్టాక్ సూచీల పతనం
- సెన్సెక్స్ 739 పాయింట్లు, నిఫ్టీ 270 పాయింట్లు డౌన్
- విండోస్ ఎర్రర్‌తో నెగిటివ్ ట్రెండ్
ముంబై, జూలై 19: వరుస రికార్డులతో అదరగొట్టిన మార్కెట్ ఒక్కసారిగా కుదేలయ్యింది. కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ఇన్వెస్టర్ల సంపద కాస్తా ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు రూ.8 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.7, 94,059.53 కోట్లు తగ్గి రూ.4,46,38,827 కోట్లకు పడిపోయింది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఎర్రర్స్ తలెత్తడంతో అంతర్జాతీయంగా ప్రతికూల ట్రెండ్ నెలకొన్నదని, దాంతో దేశీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటంతో హఠాత్ పతనం సంభవించిందని విశ్లేషకులు తెలిపారు.
శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలుత 81,587 పాయింట్ల కొత్త రికార్డుస్థాయికి చేరిన తర్వాత వెనక్కు మళ్లింది. ఆ స్థాయి నుంచి 1,000 పాయింట్లకుపైగా దిగివచ్చి 80,499 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 739 పాయింట్ల నష్టంతో 80,605 పాయింట్ల వద్ద నిలిచింది. క్యూ1 ఫలితాల్ని వెల్లడించనున్న నేపథ్యంలో హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షీణించడం సూచీలను దెబ్బతీసాయని ట్రేడ ర్లు తెలిపారు.
ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్ తొలిదశలో 24,855 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన అనంతరం వెనక్కుమళ్లి 24,508 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు 270 పాయింట్ల నష్టంతో 24,531 పాయింట్ల వద్ద నిలిచింది. విండోస్‌తో కూడిన సిస్టమ్స్ డౌన్‌కావడంతో ప్రపంచంలో పలు ఎయిర్‌లైన్ కంపెనీలు, బ్యాంక్‌లు, మీడియా సంస్థల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే దేశంలో ప్రధాన స్టాక్ ఎక్సేంజీలపైన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు తమ సిస్టమ్స్‌పై ప్రభావం లేదని తెలిపాయి.
టాటా స్టీల్ టాప్ లూజర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 5 శాతంపైగా క్షీణించగా, మరో ఉక్కు కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దా దాపు ఐదు శాతం తగ్గింది. టాటా మోటా ర్స్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, మ హీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇం డస్ట్రీస్ షేరు 2 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన ఇన్ఫోసిస్ షస్త్రరు 2 శాతం లాభపడింది. ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లు గ్రీన్‌లో ముగిసాయి.
బడ్జెట్ ముందు ఇన్వెస్టర్ల జాగ్రత్త
ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా డివైజ్‌లు క్రాష్ కావడంతో అంతర్జా తీయంగా అమ్మకాలు జరిగాయని, దాంతో దేశీయ మార్కెట్లు క్షీణించినట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీ సెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అలాగే వచ్చేవారం కేంద్ర బడ్జెట్ వెల్లడికానున్నందున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని చెప్పా రు. కేంద్ర బడ్జెట్ ఉన్నందున, ముం దుజాగ్రత్తగా ఇన్వెస్టర్లు లాభాల్ని స్వీకరించారని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.