14-02-2025 12:00:00 AM
ముగిసిన స్వామి వారి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) ః స్వస్తిశ్రీ క్రోధానామ సంవత్సర మాఘశుద్ధ దశమి శుక్రవారం 7 వ తేదీ నుండి మాఘశుద్ధ బహుళ పాడ్యమి గురువారం 13 వరకు పాతగుట్ట శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగాయి.
వారం రోజులపా టు స్వామి వారి ఆలయ పరిసర ప్రాంతా లు వైకుంఠాన్ని తలపించే విధంగా జిగేలు మని లైట్ల మధ్య వెలిగిపోయింది. ఈ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ర్ట నలు మూలల నుండి వందలాదిమంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరిం చారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వ హించారు.
ఉదయం నుండి రాత్రి వరకు పండితులు, అర్చకులు, యజ్ఞాచార్యులు, శాస్త్రోప్తంగా స్వామివారికి కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన గురువారం నాడు స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం మూలవరులకు, ఉత్సవ వరులకు, శ్రీ స్వామివారి అష్టోత్తర శతఘటభిషేకం, మహా దాశీర్వచనం, పండిత సన్మానం ఉత్సవ పరిసమాప్తి గావించారు.
ఉత్సవాలను ఆలయ ప్రధాన అర్చకు లు, ఉప ప్రధాన అర్చకులు. యజ్ఞాచార్యు లు, వేద పండితులు పారాయనీయులు నిర్వహించారు. శ్రీ స్వామివారికి ఉత్సవ మూర్తులకు వేద మంత్ర పటనములతో, పంచామృతాలతో, పళ్ళ రసములతో ,పరిమళ సుగంధ ద్రవ్యాలతో, మంత్ర పూత జలములతో, అష్టోత్తర శతఘటా భిషేక కైకర్యం ఎంతో మైమాన్వితంగా నిర్వహించారు. ఎంతో విశేషమైనదని ప్రధానార్చకులు వివరించారు.
బ్రహ్మోత్సవాల ముగింపు కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కరరావు, ప్రధాన అర్చకులు అర్చకులు, అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.