calender_icon.png 15 November, 2024 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటైనర్‌లోని 8 కార్లు దగ్ధం

11-11-2024 01:22:15 AM

కంటైనర్‌లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది, దగ్ధమైన కార్లు

కంటైనర్‌లో ఎగిసిపడుతున్న మంటలు

  1. రూ.2 కోట్ల నష్టం
  2. లారీ డ్రైవర్‌కు గాయాలు
  3. జహీరాబాద్‌లో ఘటన

సంగారెడ్డి/జహీరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్‌లో మంటలు చెలరేగి 8 కార్లు దగ్ధమయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ జహీరాబాద్ బైపాస్ వద్దకు రాగానే కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంటైనర్‌లోఉన్న 8కార్లు దగ్ధం అయ్యియి. మంటల్లో కంటైనర్ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పుటికే కంటైనర్ పూర్తిగా కాలిపోయింది.

సుమారు రూ.౨కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. కంటైనర్‌లో నిద్రపోతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి దవాఖానకు తరలించారు. బైపాస్ రోడ్డులో కంటైనర్ కాలపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కంటైనర్ డ్రైవర్ వంట చేసుకునే గ్యాస్ సిలండర్ లీక్ కావడం... లేదా షాట్ సర్యూట్‌తో మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా  అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.