27 బైక్‌ల సీజ్ వివరాలు వెల్లడించిన ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
సూర్యాపేట, నవంబర్ 4 (విజయక్రాం తి) : సూర్యాపేట జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 27 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ సోమవారం వెల్లడించారు. కోదాడ పట్టణ పరిధిలో బైక్‌లను గుర్తుతెలియని దుండగులు దొంగిలిస్తున్నారని బాధితులు వరుస ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో కోదాడ పట్టణ సీఐ రాము ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హుజూర్‌నగర్ రోడ్డులో ఫ్లుఓవర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌లపై ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
వారిని హుజూర్‌నగర్‌కు చెందిన బారి నాగరాజు, ఆంధ్రాలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండ లం తంగెడకు చెందిన గుంజి రామాంజనేయులు, షేక్ కాసినపల్లి బాష, గుంజి కృష్ణ, తమ్మిశెట్టి వెంకటేష్‌గా గుర్తించారు. వారు సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగరన్, మఠంపల్లి, కాచిగూడ, చైతన్యపురి, ఎల్‌బీనగర్, దామరచర్ల, నర్సరావుపేట, రెంటచింతల, మాచర్ల, రాజుపాలెం, నకిరేకల్, అద్దంకి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువ గల 21 బైక్‌ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గోపాలకృష్ణ పరారీలో ఉన్నాడు.
ముకుందాపురం బస్‌స్టేజీ వద్ద..
అదేవిధంగా మునగాల ఎస్‌ఐ ప్రవీణ్ ముకుందాపురం బస్‌స్టేజీ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై ముగ్గు రు వ్యక్తులు కోదాడ నుంచి సూర్యాపేట వైపునకు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆంధ్రాలోని ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్ల మండలానికి చెందిన మొచ్చర్ల శ్రీను, అలుగుల తరుణ్, కొంక చిన్నుగా వారిని గుర్తిం చారు. వీరు జూలై నెలలో ముకుందాపురం గ్రామంలో పల్సర్ బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు.
వీరిని అదుపులోకి తీసుకుని వారు చెప్పిన వివరాల ఆధారంగా మొత్తం రూ.3.1 లక్షల విలువ గల ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. తదుపరి ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసుల ఛేదనకు కృషి చేసిన కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ కె.రామకృష్ణారెడ్డి, సీసీఎస్ సీఐ శివకుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్, టెక్నికల్ టీం సభ్యులు, కోదాడ పట్టణ, మునగాల పీఎస్ సిబ్బందికి రివార్డులు అందించి అభినందించారు.