01-04-2025 02:09:36 AM
రంగారెడ్డి,మార్చి 31 (విజయ క్రాంతి ) రంగారెడ్డి జిల్లాలో మైనార్టీ సోదరులు సోమవారం ఘనంగా ఈద్- ఉల్- ఫితర్ ( రంజాన్ పర్వదిన వేడుకలను ) భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, షాద్ నగర్, కల్వకుర్తి ( అమనగల్ బ్లాక్ మండలాలు) రంజాన్ పర్వదిన వేడుకల్లో భాగం గా ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ఈదుగాల వద్ద మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం స్థానిక, అధికారులు మైనార్టీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కల్వకుర్తి కసిరెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, చేవెళ్ల కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో పాటు ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు, మల్లు రవి, ఈటెల రాజేందర్, డీకే అరుణ లు మైనార్టీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.