27-03-2025 07:56:09 PM
ఒకరి దుర్మరణం..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం... ఇచ్చోడ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనం మండలంలోని మన్నూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై నిలిచి ఉన్న సిమెంట్ లోడ్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహన క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ముందరి భాగం క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎస్సై మహేందర్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు.