రాష్ట్రంలో మొత్తం 12,771 పంచాయతీలు
5,812 జీపీల్లోనే డిజిటల్ అప్లికేషన్ వినియోగం
పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసే దిశగా ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ప్రపంచీకరణకు అనుగుణంగా దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీలను డిజిటలైజేషన్ వైపుగా అడుగులు వేయించాల్సిన అవసరం ఉంది. గత పదేళ్లలో తెలంగాణలో ఆ దిశగా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించ లేదు.
రాష్ట్రవ్యాప్తంగా కేవలం 5,812 పంచాయతీల్లో మాత్రమే డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. 50 శాతం గ్రామాలు మాత్రమే ఇప్పటివరకు డిజిటలైజ్ అయ్యాయని కేంద్ర పంచాయతీరాజ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీలను పూర్తిస్థా యిలో డిజిటలైజేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.
సమర్థపాలన కోసమే ఈ-గామ్
గ్రామాలు, వాటి పంచాయతీ బాడీల పనితీరును సమర్థంగా నడిపించేందుకు కేంద్రం నాలుగేళ్ల క్రితం ఈ పంచాయతీ మిషన్ మోడ్ (పీఎంఎం) ప్రారంభించింది. గ్రామ పంచాయతీలు అవలంబించే పాత పద్ధతులతో సమర్థ పాలన అందడం లేదనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. గ్రామాలు సాధించిన విజయాల ఆధారంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్రామ్ స్వరాజ్ అనే పని ఆధారిత సమగ్ర అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.44 లక్షల జీపీలకు సంబంధించి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి ఈ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేశారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం 2.06 లక్షల జీపీలు ఆన్‌లైన్ లావాదేవీలను పూర్తి చేశాయని కేంద్రం వెల్లడించింది.
డిజిటల్ జీపీలు 50 శాతమే
రాష్ట్రంలో మొత్తం 12,771 పంచాయతీల్లో 10,516 గ్రామాలు ఈ-గ్రామ్ సర్వీస్ ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉండ గా.. ఇప్పటివరకు కేవలం 5,812 గ్రామాలు మాత్రమే ఈ-గ్రామ్ అప్లికేషన్‌ను వినియోగించుకుంటున్నాయి. ఇప్పటివరకు కేవలం 50 శాతం జీపీలే డిజిటలైజ్ అయిన నేపథ్యంలో మిగిలిన పంచాయతీలను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
కేరళలో పూర్తిగా డిజిటలైజ్...
గ్రామ పంచాయతీలను డిజిటలైజ్ చేసిన జాబితాలో కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ కూడా ఈ అంశంలో వెనుకబడ్డాయని కేంద్ర నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 50 శాతం గ్రామ పంచాయతీలు డిజిటలైజ్ కాగా, పొరుగు రాష్ట్రమైన ఏపీలో పరిస్థితి ఇక్కడి మాదిరేఉంది. కర్ణాటక, తమిళనాడులతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
రాష్ట్రం మొత్తం ఈడూ సర్వీస్‌కు డిజిటలైజ్
జీపీలు రెడీ జీపీలు గ్రామాలు
తెలంగాణ 12,771 10,915 5,812
ఆంధ్రప్రదేశ్ 13,326 12,967 5,559
కర్ణాటక 5,958 5,251 3,659
తమిళనాడు 12,525 9,882 3,449
అండమాన్ 81 70 46