25-04-2025 11:37:27 PM
ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్ (విజయక్రాంతి): 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4, 57/5 మెమోల ఆధారంగా పాత పెన్షన్ తప్పకుండా అమలవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లోనే టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.