18-03-2025 06:04:55 PM
హుజురాబాద్ వేదికగా జరిగే టోర్నమెంట్లకు నా సహాయ సహకారులను అందిస్తా..
ముగిసిన హకీ క్రీడా పోటీలు...
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు...
హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ టర్ఫ్ హాకీ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో సీనియర్ క్రీడాకారుడు మోటపోతుల రమేష్ స్మరకర్ధం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సీనియర్స్ ఇంటర్ డిస్టిక్ హాకీ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. మూడురోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన హాకీ క్రీడా పోటీలలో కరీంనగర్, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, జట్లు సెమీఫైనల్స్ కు చేరగా ఉదయం కరీంనగర్ వర్సెస్ మెదక్ ఫస్ట్ సెమీఫైనల్ ఆడగా కరీంనగర్ పై మెదక్ 3-1 గోల్స్ తో విజయం సాధించి ఫైనల్కి చేరింది.
రెండో సెమీఫైనల్ నిజాంబాద్ వర్సెస్ హైదరాబాద్ తలపడగా హైదరాబాద్ పై నిజామాబాద్ ఒకటి సున్నా గొలుసుతో విజయం సాధించి ఫైనల్ లోకి చేరింది. థర్డ్ ప్లేస్ కోసం హైదరాబాద్, కరీంనగర్ జట్లు తలపడగా ఇరుజట్లు చెరొక గోల్ చేయడంతో డ్రాగ ముగిసింది. ఎంపైర్లు స్ట్రోక్ ద్వారా విజేతను నిర్ణయించేందుకు ఇరుజట్ల కెప్టెన్లతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నాలుగు గోల్స్ చేయగా కరీంనగర్ రెండు గోల్స్ చేయడంతో హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో నిజామాబాద్, మెదక్ తలపడగా నిజామాబాద్ పై మెదక్ 4-1 గోల్స్ తో విజయం సాధించి విజేతగా నిలిచింది. రన్నరప్ గా నిజామాబాద్, హైదరాబాద్ మూడో ప్లేస్ తో సరిపెట్టుకుంది.
ముఖ్యఅతిథిగా హాజరైన ఒడితల ప్రణవ్ బాబు, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి మాట్లాడుతూ... హుజురాబాద్ వేదికగా మరెన్నో టోర్నమెంట్లు నిర్వహించాలని, నా తరపున మా ప్రభుత్వ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో హుజురాబాద్ పెద్దల్లో విద్యా వైద్యంతో పాటు క్రీడలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. టోర్నమెంట్ నిర్వహించిన టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రాజేంద్ర ప్రసాద్ ని, హాకీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక శ్రీనివాస్, గని శెట్టి ఉమామహేశ్వర్ ని అభినందించారు. అనంతరం గెలిచినా జట్టుకు బహుమతులు ప్రధానం చేశారు.
తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ సెక్రటరీ భీమ్ సింగ్, తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కళ్యాణి, కళ్యాణి కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ సురేందర్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల గౌడ్, కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ టి శ్రీనివాస్, పుల్ల పవన్, పీటీలు శ్యాంసుందర్, రవికుమార్, విశ్రాంత పిటీలు రాజిరెడ్డి, ప్రభాకర్, తిరుపతి, సజ్జు, సాయి కృష్ణ, రాజేష్, కే రాజేష్, విక్రం, సాంబరాజుతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.