calender_icon.png 10 January, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైబ్రరీల నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేస్తా

10-01-2025 12:00:00 AM

 గజ్వేల్ గ్రంధాలయాన్ని పరిశీలించిన రాష్ర్ట గ్రంథాలయ చైర్మన్ రియాజ్

గజ్వేల్, జనవరి 9: రాష్ర్టంలోని గ్రంథాలయాలకు నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ర్ట గ్రంధాలయాల చైర్మన్ రియాజ్ అన్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక లైబ్రేరియన్ తిరుపతిరెడ్డి  గ్రంథాల యంలోని వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాల వివరాలను చైర్మన్ రియాజ్ కు తెలిపారు.

గ్రంధాలయాన్ని పరిశీలించిన ఆయన గ్రంథాలయ నిర్వహణ చాలా బాగుందని, ప్రజలు ప్రభుత్వ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు  సిద్ధమయ్యే నిరుద్యోగ యువత గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు.

గ్రంథాలయాలకు నూతన భవనాల ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనట్లు రియాజ్ తెలిపారు. అంతకుముందు గజ్వేల్ పట్టణంలోని టివైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డితో కలిసి  లైబ్రరీ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టి వై ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కల రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్  జఖీ యుద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.