calender_icon.png 14 November, 2024 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ ఖ్యాతిని నిలబెట్టేందుకు కృషి

14-11-2024 02:49:42 AM

డిసెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు

ఓయూ వీసీ కుమార్ మొలుగారం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ ఖ్యాతిని నిలబెట్టేందుకు కలసికట్టుగా కృషి చేయాలని యూనివర్సిటీ వీసీ కుమార్ మొలుగారం పిలుపునిచ్చారు. వీసీగా బాధ్యతల స్వీకరించాక బుధవారం ఓయూ దూర విద్యాకేంద్రం ఆడిటోరియంలో అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీకి వీసీగా తనను నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

డిసెంబర్ 1 నుంచి ఓయూలో లావాదేవీలన్నీ ఆన్‌లైన్ చేయబోతున్నట్లు తెలిపారు. పేస్లిప్, ఫాం 16 సహా ధ్రువపత్రాలన్నీ ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. పరిపాలన, విద, వైద్య పరిశోధనలకు ఆధునిక సాంకేతికతలో ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఓయూకు న్యాక్ గుర్తింపు కోసం కావాల్సిన అంతర్గత నాణ్యతా అంచనాల విభాగానికి అవసరమైన సమాచారాన్ని అందజేయాలని సూచించారు. 

జియోట్యాగింగ్ ద్వారా అధ్యాపకులు తమ హాజరును నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేంద్రనాయక్, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష పాల్గొన్నారు.