05-04-2025 01:45:11 AM
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ ఏప్రిల్ 4: కోదాడ కె ఆర్ ఆర్ అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మినీ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కె ఆర్ ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం (స్పోరట్స్ డే) నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రిటైర్డ్ ప్రిన్సిపల్స్ డాక్టర్ అందే సత్యం, అరవపల్లి శంకర్, మంత్రి ప్రగడ శ్రీధర్, రిటైర్డ్ టీచర్ ఎం రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ, వైస్ చైర్మన్.. అధ్యాపక బృందం బి. సైదిరెడ్డి, డాక్టర్ నిర్మల కుమారి, శ్రీలత, నాగిరెడ్డి, ఫ్రాన్సిస్ యాకోబ్, వి.వి.రెడ్డి, జి సైదులు, ఎస్‌ఎం రఫీ, పల్లపాటి సైదులు, టి. రాజు,కే సైదులు, ఆకుల రాజు, సైదమ్మ, సుమలత, జి ఎల్ ఎన్ రెడ్డి, విజయకర్ మల్లయ్య, శ్రీలక్ష్మి, యాదమ్మ, పాల్గొన్నారు.