calender_icon.png 7 February, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి

07-02-2025 01:36:01 AM

మహిళా కాంగ్రెస్ రాష్ర్ట ఉపాధ్యక్షురాలు సుగుణారెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి ): జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ర్ట ఉపాధ్యక్షులు సుగుణారెడ్డి అన్నారు. గురు వారం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నగరం లోని ఇందిరాభవన్లో సమావేశం నిర్వహిం చారు.

ముఖ్య అతిధిగా హాజరైన సుగుణా రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వం ఆధారంగానే మండల, టౌన్ అధ్యక్షులుగా నియమించ డం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎ న్నికల్లో పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.