హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్ ఏవియేటర్స్ సొసైటీలోని సీనియర్ల అనుభవాలను జూనియర్లకు పంచి సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు కెప్టెన్ అనురాధారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 50 మందితో ప్రారంభమైన తమ హైదరాబాద్ ఏవియేటర్స్ సొసైటీలో ప్రస్తుతం 600 మంది సీనియర్లు భాగస్వాములై ఉన్నారన్నారు. తమ సొసైటీని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో స్థాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆడి ప్రతినిధులకు ఏవియేషన్ బుక్‌ను అందజేశారు. ఇదే వేదికపై ఆడి సంస్థ ప్రతినిధులు ‘ఆడి క్యూ3’ బోల్డ్ ఆడిషన్‌ను లాంచ్ చేశారు. కార్యక్రమంలో జీ ప్రభాకరరావు, డీ శరత్, సునీల్‌కుమార్, అనిల్‌రావు, హెచ్ రామ్ పాల్గొన్నారు.