* ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్‌రెడ్డి
గజ్వేల్, జనవరి 6: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే పీఆర్టీయూ స్ఫూర్తితో ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించడంతో పాటు ప్రభు విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని పీఆర్టీయూ బలపర్చిన మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగమ అన్నారు.
సోమవారం గజ్వేల్ పట్టణంలో పీఆర్టీయూ జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులంతా తనను సోదరుడిగా భా తన గెలుపునకు కృషి చేయాలన్నారు. మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్‌రెడ్డి, సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ, రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.