22-03-2025 01:51:22 AM
ఖమ్మం, మార్చి 21( విజయక్రాంతి ):-జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల అధ్యక్షుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని బ్యాంక్ పురోభివృద్ధికి, బలోపేతానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నట్లు బ్యాంక్ జిల్లా అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బ్యాంక్ 126వ మహా జన సభ బ్యాంక్ ప్రధాన కార్యాలయం లో శుక్రవారం దొండపాటి అధ్యక్షతన జరిగింది.
ఇంచార్జ్ సిఈఓ ఎన్. వెంకట ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో అర్హత ఉన్న సహకార సంఘాల ద్వారా దీర్ఘకాలిక రుణాలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.బ్యాంక్ ద్వారా అందిస్తున్న అన్ని రకాల సేవలు రైతులకు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్బంగా బ్యాంక్ నివేదిక లను వఏ కగ్రీవంగా ఆమోదించారు.ఈ కార్యక్రమం లో ఖమ్మం దీసీవో జి. గంగాధర్ రావు, డిఏవో డి. పుల్లారావు, పాలక వర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.