calender_icon.png 26 April, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి కృషి

23-04-2025 06:25:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని మండలాల్లో, గ్రామాల్లో పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నట్టు జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(District Convener Syed Haider) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించి అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామ కమిటీలను పట్టణ కమిటీలను ఏర్పాటు చేసేందుకు గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు సుధాకర్ హాజరవుతారని పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.