calender_icon.png 8 February, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి

08-02-2025 12:38:06 AM

టీపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్

 కామారెడ్డి, ఫిబ్రవరి 7  (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్య బలోపేతానికి టి పి టి ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ కృషి చేస్తారని టి జి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీచర్ ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుండి  రిటైర్డ్ అయ్యేంత వరకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేశారని అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా గెలిపిస్తే టీచర్ల గొంతుకగా పనిచేస్తాడని పేర్కొన్నారు.

శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వై అశోక్ కుమార్ కు మద్దతిస్తున్న భాగస్వామ్య సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్  మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం డబ్బుసంచులతో వస్తున్నారని,వారిని నిలువరిద్దామన్నారు.

ప్రభుత్వ విద్య బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పేదలకు ప్రభుత్వ విద్య దూరమవుతున్న పట్టించుకునే వారే  కరువయ్యారని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి ఆరోపించారు.

ధన రాజకీయాలను ఓడించి ఉద్యమ నాయకులను ఎమ్మెల్సీ లు గా ఎన్నుకున్నట్లయితే ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందని అన్నారు.  ఉపాద్యాయ సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ పటిష్టతకు కృషి చేస్తూ విద్యా వ్యవస్థ పటిష్ఠతకు కృషి చేస్తాడు అని తెలిపారు.

ఈ సమావేశంలో కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కె వేణుగోపాల్ మాట్లాడుతూ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ గెలిచిన తర్వాత  ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి, ప్రవీణ్ కుమార్, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, జిల్లా ఉపాధ్యక్షుడు టి శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు నళినీ దేవి, జిల్లా కార్యదర్శి నరేందర్, ప్రకాష్, గోపు శ్రీనివాస, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి సంగయ్య, శ్రీనివాస్, రాజన్న పాల్గొన్నారు.