కాప్రా (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించదుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పెట్ హెచ్ బి కాలనీ డివిజన్ తిరుమలనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాలనీ గుర్తుల సైన్ బోర్డులను స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజవర్గ సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడతామని, కాలులలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కాలనీలోని ప్రధాన సర్కిలలో బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన కాలనీ కమ్యూనిటీ హాల్, పాఠశాలలు, గృహాలు, అపార్ట్మెంట్లు, దేవాలయాలు తదితర చిరునామాలు సులువుగా గుర్తించే విధంగా ఉపయోగపడతాయని మిగతా కాలనీలలో కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సులభతరమైన పద్ధతులు అవలంబిస్తే చిరునామాలు గుర్తించవచ్చని, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలపై కాలనీలో పర్యటించి వివిధ సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. అనంతరం సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు మల్లేష్ గౌడ్, అమరేంద్ర బాబు, వెంకన్న గౌడ్, శ్రీనివాస్, జై సింగ్ ఠాకూర్, కృష్ణమోహన్, మురళికృష్ణ, కృష్ణమూర్తి, సీహెచ్ రాజు, బీడీ దాస్, డీఎల్ ప్రసాద్, శేఖర్, కర్ణాకర్, రఫీక్, రమణ గుప్తా, శివ కుమార్ గుప్తా, రంగ సాయి, నారాయణ, రవి ప్రభు, నాయకులు జంపాల్ రెడ్డి, జైపాల్ నాయుడు, బాలరాజు, రామకృష్ణ, వసంతరావు, నరసింహ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.