calender_icon.png 23 December, 2024 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డెన్ ల సమస్యల పరిష్కారానికి కృషి

22-12-2024 07:23:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): వివిధ సంక్షేమ శాఖలో నిర్వహించబడుతున్న వసతి గృహాల అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా సంఘ ఐక్యత కోసం పాటుపడతామని నిర్మల్ జిల్లా అధ్యక్షులు బునుగల సుజాత ప్రధాన కార్యదర్శి రాజేందర్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. నిర్మల్ జిల్లాలో అన్ని వసతి గృహాల అధికారులతో సమన్వయం చేసుకొని వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడతామని వారు తెలిపారు. జిల్లా బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేసుకుంటామని తెలిపారు.