calender_icon.png 1 January, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

29-12-2024 10:42:36 PM

సంగారెడ్డి జిల్లా ట్రైసా నూతన కార్యవర్గం ఎన్నిక...

సంగారెడ్డి (విజయక్రాంతి): రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సెర్వీసెస్ అసోసియేషన్, రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు రాష్ట్ర కో ఆర్డినేటర్ నారాయణరెడ్డి, ఉపాద్యక్షులు నిరంజన్ రెడ్డిలు ఆధ్వర్యంలో ట్రైసా నూతన కార్యవర్గాన్ని ఎందుకు చేశారు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. రెవిన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ట్రెసా అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా ట్రెసా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియచేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు.

రెవిన్యూ వ్యవస్థలో ఎన్ని సంఘాలు వచ్చిన, ట్రెసా మాత్రమే గట్టిగ నిలబడి పని చేస్తుందన్నారు. ట్రెసా కృషి వల్లనే జూనియర్ అసిస్టెంట్ టు సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ టు నాయబ్ తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ టు తహసీల్దార్, తహసీల్దార్ టు డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వం రెవిన్యూ శాఖను నిర్వీర్యం చెయ్యాలని చూసింది. ప్రస్తుత ప్రభుత్వం రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేసి రైతులు, ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుందని ఆ వైపుగా ఉద్యోగులు సహకరించాలని కోరారు. అనంతరం ట్రెసా సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షునిగా కె. గంగాధర్ రావ్, కార్యదర్శిగా యమ్. కిరణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు, పి. దశరథ్, కోశాధికారిగా కె. బాలరాజు (23) మందితో నూతన కమిటీని ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాట్లు ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జాహిరాబాద్ డివిజన్ ల నుండి రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.