12-03-2025 01:23:13 AM
Efforts to solve the problems of graduates
జహీరాబాద్, మార్చి 11: పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తాన ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి గెలిపించిన పట్టభద్రులకు కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. విద్య రంగ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. 317 జీవో ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ముత్తిరెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ నవబాద్ జగనాథ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, గొల్ల భాస్కర్, మల్లికార్జున పాటిల్, సుధీర్ బండారి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.