calender_icon.png 11 January, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొల్లకుర్మల సమస్యల పరిష్కారినికి కృషి

30-12-2024 03:02:40 AM

 జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్

నారాయణఖేడ్, డిసెంబర్29 : గొల్లకుర్మల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాననిజహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన భూం  విగ్రహ ప్రతిష్టాపన ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖేడ్‌కు సరిహద్దు రాష్ట్రమైన కర్నాటకలోని బీదర్, గుల్బర్గా ప్రాంతంలో గొల్లకుర్మలు ఎస్టీలుగా కొనసాగుతున్నారని అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలోని జహీరాబాద్, నాయణఖేడ్ ప్రాంతాల్లో నివసించే గొల్లకుర్మలు బీసీ జాబితాలో ఉండటంతో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని కొంతకాలంగా గొల్లకుర్మలు ఉద్యమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకె  ఎంపీ తెలిపారు.

ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేశ్‌షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కిష్టయ్య మాస్టర్, అప్పారావ్ శెట్కార్, రాష్ట్ర పీసీ సభ్యులు శ్రీనివాస్, గొల్లకుర్మ సంఘం నాయకులు మల్‌శెట్టి, ప్రభుయాదవ్, నరేశ్  గోపాల్, సంజీవ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.