calender_icon.png 22 February, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

18-02-2025 12:00:00 AM

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దాసరి ప్రసాద్    

అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 17 : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్ అన్నారు. రావి నారాయణరెడ్డి ఆడిటరియములో జరిగిన(బీ ఓసీ)  జిల్లా మహాసభలు జరిగాయి. ఈ మాసభలో దాసరి ప్రసాదను రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా రెండవసారి ఎన్నుకున్నారు.

ఈ  సందర్భంగా దాసరి ప్రసాద్ మాట్లాడుతూ... జిల్లావ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా నామీద నమ్మకం ఉంచి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు  ప్రతినిధులకు రాష్ట్ర జిల్లా నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.