calender_icon.png 24 October, 2024 | 8:56 AM

జీవో 46 సమస్య పరిష్కారానికి కృషి

24-10-2024 02:40:18 AM

  1. ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు 
  2. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య వెనుక ఎవరున్నా వదలం
  3. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): జీవో 46తో ఇబ్బంది పడుతున్న పోలీసు అభ్యర్థుల కు న్యాయం చేస్తామని, సమస్యను సీఎస్ దృష్టికి తీ సుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన ‘మంత్రుల తో ముఖాముఖి’ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రజల సమస్యలను ఆలకించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 26న ప్రభుత్వ ప్రధా న కార్యదర్శితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయించనున్నట్లు చెప్పారు. జీవో 46తో ఏ విధమై న సమస్యలు వాటిల్లుతున్నాయో సీఎస్‌తో బాధితు లు చెప్పుకొనే అవకాశం ఉంటుందన్నారు.

ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్య మని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగులు, వీఆర్‌ఏ, డీఎస్సీ అభ్యర్థులు, ఇతర సంఘాల ప్రతినిధులు కూడా మంత్రికి విజ్ఞప్తులు అందజేశారు.  మంత్రి శ్రీధర్‌బాబుకు తమ సమస్యలను పరిష్కరించాలని 328 వినతులను ప్రజలు అందజేశారు.   

హత్యా రాజకీయాలు తగవు..

ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదని, హత్యకు కారణమైనవారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యపై స్పంది స్తూ.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉం టుందన్నారు.

పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. హత్యా ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరింపిచాలని జీవన్‌రెడ్డి  కోరారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.