ఎమ్మెల్యే సబితారెడ్డి
మహేశ్వరం, ఆగస్టు 26 (విజయక్రాంతి): బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆదేశించారు. సోమవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లెల గూడ, సత్యసాయి నగర్, మిథిలా నగర్ కాలనీలో అధికారులతో కలిసి ఆమె పర్యటిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లెలగూడ ప్రధాన రోడ్డు మార్గంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని.. సమస్య పరి ష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. బస్తీల్లో ప్రధాన రోడ్డు మార్గాల వెడల్పు పనులు చేపట్టేందుకు అధికారులను ఆదేశించామన్నారు.
అనంతరం మీర్పేట్ క్యాంపు కార్యా లయంలో వికలాంగుడికి ట్రై సైకిల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సి పల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు లావణ్య, రాజేందర్‌రెడ్డి, రేఖ, సురేఖ, పద్మ, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కామేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.