మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల
మలక్‌పేట, జూలై 2: నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. మంగళవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఆస్మాన్‌ఘడ్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.