calender_icon.png 22 September, 2024 | 4:36 AM

ఏజెన్సీల్లో సమస్యల పరిష్కారానికి కృషి

22-09-2024 02:00:06 AM

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): రాష్ర్టంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్ర భుతం ప్రజా ప్రభుతమని, ఏజెన్సీ ప్రాం తాల్లో సమస్యల పరిష్కారానికి తమ ప్రభు త్వ కృషి చేస్తున్నదని గ్రామీణ అభివృద్ధి, పం చాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నా రు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కుమ్రం భీం భవన సముదాయంలో శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలి సి ఉమ్మడి జిల్లాలోని గోండానా పంచాయ తీ రాయి సెంటర్ల ప్రతినిధులు, సర్ మెడిలు, పటేళ్లతో సమీక్ష సమావేశం నిరహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసి గ్రామాల్లో పునాది లాంటి రాయి సెం టర్‌ల అభిప్రాయాలను ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్ర భుతం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రా ష్ర్ట నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంతో కలిసి గోండానా సమితి, రాజ్ గోండ్ రాయి సెంటర్ ప్రతినిధులతో సమావేశాలు నిరహించి, గిరిజన ఆచారా లు, సంప్రదాయాలు, కట్టుబాట్లను కాపాడుకుంటూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆదివాసి, గిరిజనుల అభివృద్ధికి గ్రామాల్లోని కమిటీలు అందించే అభిప్రాయాలను సీకరించి ప్రభుతం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్లు రాజరిషా, వెంకటేష్ ధోత్రే, ఎస్పీలు గౌష్ ఆలం, శ్రీనివాసరావు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు.