రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ముందుం టుందని కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో కమిషన్ తొలి సమావేశం జరిగింది. ఇందులో వ్యవసాయ రం గానికి చెందిన పలువురు నిపుణుల నుంచి సూచనలు, సలహాలు తీసుకు న్నారు.
ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్ష లాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఒక్కొటిగా పరిష్కరిస్తోంద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, దేశ చరిత్రలో కనివినిఎరుగనీ రీతిలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వివిధ రాష్ట్రాల నుంచి ప్రశంసలు పొందు తుందని తెలిపారు.
త్వరలో రైతు భరోసా, రైతు బీమా, పంటరుణాలు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. సాం ప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపే లా అవగాహనా కార్యక్రమాలు నిర్వ హిస్తామని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, కన్నెగంటి రవి, లుబ్నా సర్వత్ పాల్గొన్నారు.