calender_icon.png 26 December, 2024 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి

07-11-2024 05:57:20 PM

కాప్రా (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి శేఖర్, వాటర్ వర్క్స్ డిజిఎం సతీష్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్ లో డ్రైనేజ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని, డివిజన్ లో చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేసినందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే ఉప్పల్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి జన్ శేఖర్, బుచ్చి, బాలరాజ్ లతో పాటు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.