calender_icon.png 27 November, 2024 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్చి చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి

27-11-2024 05:03:38 PM

రైతులు లాభదాయక మిర్చి పంట వైపు దృష్టి సారించాలి

40 లక్షల రూపాయల పెట్టుబడితో మహిళా సంఘాల ద్వారా చిల్లింగ్ యూనిట్ ఏర్పాటు

ఎన్.ఐ.ఎఫ్.టి.ఎం ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

పెద్దపల్లి (విజయక్రాంతి): ముత్తారంలో పైలెట్ ప్రాజెక్టు కింద మహిళా సంఘాలచే మిర్చి చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  ఎన్.ఐ.ఎఫ్.టి.ఎం ప్రతినిధులతో ముత్తారంలో మిర్చి చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ (ఎన్.ఐ.ఎఫ్.టి.ఎం) వారి సహకారంతో ముత్తారంలో మహిళా సంఘాల ద్వారా రూ. 40 లక్షల పెట్టుబడితో  మిర్చి పౌడర్, సాస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మిర్చి చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు 20 లక్షల రూపాయలు ఎన్.ఐ.ఎఫ్.టి.ఎం సంస్థ నుండి అందజేస్తారని, మరో రూ. 20 లక్షల రూపాయలు మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ తో యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ముత్తారం, అడవి శ్రీరాంపూర్, ఓడెడు, సీతంపేట గ్రామాలలో 750 మంది స్వశక్తి మహిళా సంఘాల సభ్యులను గుర్తించి, వారిని వరి పంట నుంచి మిర్చి పంట సాగు దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. మిర్చి యూనిట్ ఏర్పాటు ద్వారా రైతులను కూడా లాభసాటి పంటల దిశగా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలన్నారు. మిర్చి పంట పండించడం వల్ల రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశం ఉందని, మిర్చి యూనిట్ ఏర్పాటు పరిసర ప్రాంతాల్లో రైతులు వారి నుంచి విడిచి పంట సాగుకు డైవర్ట్ అయ్యే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని, రైతులు పండించే పంటకు మంచి మార్కెట్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని, నిర్దిష్టమైన మిర్చి రకం పంట సాగు వల్ల రైతులకు అధిక లాభం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్ ,జిల్లా ఉద్యానవన శాఖా అధికారి జగన్ మోహన్ రెడ్డి, ఏజిఎం నాబార్డ్ జయ ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.