calender_icon.png 30 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు కోర్టుల ఏర్పాటుకు కృషి

13-09-2024 12:29:30 AM

హైకోర్టు జడ్జి అభినంద్‌కుమార్

కాప్రా, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అదనపు కోర్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు జడ్జి అభింనద్ కుమార్ షావీలి తెలిపారు. కాప్రా సర్కిల్ కుషాయిగూడలోని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన 4వ అదనపు డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టును గురువారం హైకోర్టు జడ్జి బీ.విజయ్‌సేన్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ రావు, బార్ అసోసియెషన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డితో కలిసి అభింనద్‌కుమార్ షావీలి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తం గా జిల్లాలో అదనపు కోర్టులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో అదనపు కోర్టులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని బార్ అసోసియషన్ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని.. వాటి ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తామన్నారు. అదేవిధంగా లోక్ అదాలాత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించి సత్వరమే కేసుల పరిష్కారానికి జిల్లా జడ్జిలు, న్యాయవాదులు కృషి చేయలన్నారు.

అనంతరం హైకోర్టు జడ్జిలను బార్ అసోసియెషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా 1వ అదనపు జిల్లా జడ్జి రఘునాధ్‌రెడ్డి, జిల్లా జడ్జిలు విక్రం, కిరణ్‌కుమార్, మహేశ్‌నాధ్, దీప్తి మానస, అరుణ్‌తేజ, రవీందర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మోహన్, కార్యదర్శి శ్రీకాంత్‌తో పాటు న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.