calender_icon.png 18 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల పింఛన్ భద్రతకు కృషి

18-01-2025 02:07:42 AM

  • కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్‌దత్ 
  • సింగరేణి సీఎంపీఎఫ్ 183వ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశం

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): పింఛన్ సేవలను మరింత మెరుగుపరచడంతోపాటు, కార్మికులకు పింఛన్ భద్రతను కల్పించడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు మంత్రి త్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్‌దత్ పేర్కొన్నారు. కోల్‌మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌వో) 183వ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగింది.  ఈ సమా వేశంలో పింఛన్‌దారుల సంక్షేమం దృష్ట్యా పింఛన్ నిధి సుస్థిరతకు సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. తొలిసారిగా హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సీఎంపీఎఫ్ అధికారులు, బొగ్గు  కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.