calender_icon.png 31 January, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి కృషి

30-01-2025 12:43:39 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్

ముషీరాబాద్, జనవరి 29 : ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేట్  పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన-2025  నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన తన నివాసంలో ట్రస్మా వ్యవస్థాపక ట్రస్టీ కందాల పాపిరెడ్డి, ఎన్‌ఎన్ రెడ్డిలతో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శికే అనిల్‌కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్‌రెడ్డి, బస్వరాజ్, రాంప్రసాద్ పాల్గొన్నారు.