calender_icon.png 20 January, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

20-01-2025 07:14:29 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ ఉపాధ్యక్షులు భీమనాదని సుదర్శన్ లు స్పష్టం చేశారు. ఏరియాలోని ఎస్ అండ్ పిసి కార్యాలయంలో సోమవారం సెక్యూరిటీ సిబ్బందిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ... సెక్యూరిటీ గార్డుల షెల్టర్స్ రూమ్ లను ఆధునికరించాలని, కార్యాలయం నుండి విధులు నిర్వహించే ప్రాంతానికి వాహన సౌకర్యం కల్పించాలని, లేకుంటే పర్సనల్ వెహికల్ కు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలనీ, గార్డులకు కూర్చునేందుకు వీలుగా నూతన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలనీ, ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని కోరారు. సెక్యూరిటీ సిబ్బంది తెలిపిన సమస్యలను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎగ్గేటీ రాజేశ్వర్ రావు, పిట్ కార్యదర్శి పారిపెల్లి సంజీవ్, భిక్షపతిలు పాల్గొన్నారు.