టీజేఈయూ అధ్యక్షుడు చవ్వా సతీశ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28(విజయక్రాంతి) : జలమండలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ (టీజేఈ కృషి చేస్తోందని యూనియన్ అధ్యక్షుడు చవ్వా సతీశ్ అన్నారు. శనివారం ట్రాన్స్‌మిషన్ డివిజన్ హైదర్‌నగర్ రిజర్వాయర్ సమీపంలో నిర్వహించిన సమావే ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ అనుబంధ యూనియన్, నాయకులు స్వలాభం కోసమే పనిచేశారని, కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు.
తమ యూనియన్ గౌరవాధ్యక్షులు మధుయాష్కిగౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని పదోన్నతుల అప్‌గ్రేడేషన్ విషయంలో ఇటీవల ఎండీతో మాట్లాడి సెక్రటేరియట్‌కు పంపించి చర్యలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రాజ్, నాయకులు.. రాజ్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్, శ్రీనివాస్‌యాదవ్, ఆశం, శంకర్, ప్రకాశ్, అజయ్‌నాథ్, కృష్ణ, లక్ష్మణ్‌యాదవ్, వెంకటేశ్, సందీప్, గౌస్‌పాష తదితరులు పాల్గొన్నారు.