12-02-2025 05:44:06 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం 11 04 అనేక పోరాటాలను చేసిందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ పోచయ్యలు అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో 114 ఉద్యోగుల సంఘం 75వ వార్షికోత్సవ వేడుకలను జెండాను ఎగురవేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన అనేక విజయాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.