- 17 నుంచి జరిగే ప్రజాపాలన విజయవంతం చేయాలి
- కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల
- టీఎన్‌జీవో నేతలతో ఆత్మీయ సమ్మేళనం
కరీంనగర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా కంకణబద్దులై ఉన్నారని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్‌రావు స్పష్టంచేశారు. గురువారం ఆయన టీఎన్‌జీవో రాష్ట్ర, జిల్లా నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడు తూ.. ఉద్యోగుల సహకారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తాను స్థానికంగా కరీంనగర్‌లోనే ఉంటూ ప్రజా సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం రాజేందర్‌రావును టీఎ న్‌జీవో నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, నాయ కులు నరసింహస్వామి, శ్రీనివాస్, ప్రభాకర్, కాళీచరణ్, రమేశ్, సర్దార్ హర్మీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.