14-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): తెలంగాణ బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని, నిర్మాణ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర సాగునీటి, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్థలంలో ఆదివారం నిర్వహించిన సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వారికోత్సవ వేడు కకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడా రు.
బిల్డర్లు నగరాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు కల సాకారమైందని గుర్తుచేశారు. రాజధానిలో ప్రజారవాణాను మెరుగుపరిచేంపదుకు మెట్రో ను విస్తరిస్తున్నామని వెల్లడించారు. మహానగరాన్ని మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని వివరించారు.
పెట్టుబడుల కు అనుకూలంగా ఫ్యూచర్ సిటీ ని అభివృద్ధి చేస్తామని తెలిపా రు. మూసీ ప్రక్షాళన చేపట్టి నదీ పరీవాహక ప్రాంతాన్ని అభివృ ద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్‌కు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమం లో పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.