calender_icon.png 19 April, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ అవైలబుల్ స్కూల్ సమస్యల పరిష్కారానికి కృషి

15-04-2025 12:45:44 AM

- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సిద్దిపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి):సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశాలలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల విగ్రహానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి లు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సమావేశంలో పాల్గొని బక్కీ వెంకటయ్య మాట్లాడారు. నవ సమాజ స్థాపన నిర్మాణం జరగాలంటే మనందరం మహాత్మా జ్యోతిబా పూలే, బాబు జగ్జీవన్ రామ్, బి. ఆర్. అంబేద్కర్ లు  చూపిన బాటలో నడవాలన్నారు.

జిల్లాలోని బెస్ట్ అవలేబుల్ స్కూల్ లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే శాఖ పరమైన నివేదికను సమర్పించాలని, దాని ఆధారంగా మే నెలలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ప్రస్తుతం మనం అన్ని హక్కులను స్వేచ్ఛగా వాడుకోగలుగుతున్నామంటే కారణం అంబేద్కర్ అని గుర్తు చేశారు. దృఢమైన సంకల్పంతో ప్రయత్నించాలని, అప్పుడే అనుకున్న విజయాన్ని సునాయాసంగా సాధించగలమన్నారు.

జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ సమాజ అభివృద్ధి అవగాహనతోనే సాధ్యపడుతుందని, అందుకు మనందరం భాగస్వామ్యంతో అంబేద్కర్ లాంటి మహనీయులు ఎదుర్కొన్న సంఘటలను, వాటి ప్రతిఫలాలను  తెలుసుకుని ప్రణాళికతో ముదుకు సాగాలన్నారు. నేటితరం యువతకు అంబేద్కర్ గురించిన ఆలోచన విధానాలను వివరించాల్సిన అవసరం ఉందని అందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్.డి.ఓ సదానందం, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, డి.ఎస్.డి.ఓ. హమీద్, తహసీల్దార్ సలీం, వివిధ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.