calender_icon.png 22 February, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా భాష గుర్తింపునకు కృషి

21-02-2025 01:21:23 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): బంజారాలు, ఆదివాసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్  అన్నారు. గురువారం బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా నిర్వహించిన భోగ్ బండారి హోమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బంజారాల భాషకు గుర్తింపు ఇచ్చే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ, ప్రకృ తిని కాపాడేది గిరిజనలేనన్నారు.

విదేశీ దు రాక్రమణదారుల కుట్రల కారణంగా చెల్లాచెదురైన బంజారాలకు వారి మహాపురుషుడు సంత్ సేవాలాల్ చూపిన మార్గం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బంజారా ధార్మిక్ వ్యాప్తి మహాసంఘ్ నాయకులు పాల్గొన్నారు.