ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, జూలై 4(విజయక్రాంతి): నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, చేతినిండా పనులు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దేనపల్లి టెక్స్‌టైల్ పార్కులో గురువారం యజమానులతో ప్రభుత విప్ శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిరహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్లలోని నేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
కార్మికుల సమస్యపై సమ గ్రంగా అధ్యయనం చేసిన తర్వాత పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. పలువురు యజమానులు తమకు విద్యుత్ బిల్లు లో 50 శాతం సబ్సిడీ ఇవాలని, పరిశ్రమల ఏర్పాటుకు ఎన్‌ఓసీ ఇప్పించాలని, కామన్ ఫెసిల్టేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విప్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశరరావు దృష్టికి తీసుకెళ్తానని విప్ చర్చిస్తామని స్పష్టం చేశారు. యజమానులకు సైతం బకాయిలు విడతల వారీగా విడుదల చేయిస్తున్నామని తెలిపారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్ డీడీ వెంకట్రావు, ఏడీ సాగర్ పాల్గొన్నారు.