calender_icon.png 24 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హు లైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి

24-01-2025 01:23:10 AM

కలెక్టర్ ఎం హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి జనవరి 23 (విజయ క్రాంతి): అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుందని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం రోజు వలిగొండ మండలం లోని నాతళ్లగూడెం, రామన్నపేట మండలంలోని  సిరిపురం గ్రామం, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో  మూడవ రోజు కొనసాగుతోన్న ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమానికి  జిల్లా  కలెక్టర్ హనుమంత రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్ల వంటి నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి రూ.12,000 వేల రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన గుంట భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజా పాలన గ్రామ సభ లో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని అన్నారు.

వ్యవసాయ యోగ్యమైన భూమికి ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని అన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, అలాగే కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం లేదా తొలగించడం జరగలేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా కొత్త దరఖాస్తులు గ్రామ సభ లో కూడా దరఖాస్తులను సమర్పించవచ్చని, ఆయా దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు ప్రయోజనం చేకూరుస్తామని భరోసా కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అధిక ప్రాధాన్యతనిస్తూ ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్ష రూపాయలు  ఇవ్వడం జరుగుతుంది అన్నారు.  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.