calender_icon.png 6 November, 2024 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతులు కల్పించేందుకు కృషి..

04-11-2024 02:36:12 PM

కాప్రా (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ డబల్ బెడ్ రూమ్ డిగ్నిటీ కాలనీలో మంచినీటి సరఫరాను స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, వాటర్ వర్క్స్ మేనేజర్ వేణుగోపాలతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నెలకొన్న సమస్యలను  దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు రాము ప్రదీప్, కాలనీ వాసులు బోడ నరేష్, రామచందర్, సీతామహాలక్ష్మి, లక్ష్మి, రజిని, అనిత, జ్యోతి, రోజా, మల్లేష్, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, జాన్, చంద్రశేఖర్, పాల్ రాజ్, అశోక్, నరసింహ, మధు, కృష్ణలతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.