calender_icon.png 25 November, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరగా ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి

27-08-2024 02:26:16 AM

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి 

ఏకతాటిపైకి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): జర్నలిస్టులకు త్వరగా ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి  అన్నారు. సోమవారం దేశోద్దారక భవన్‌లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటవ్ సొసైటీ సీని యర్ సభ్యులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులందరు ఏకతాటిపై రావాల ని తీర్మానం చేశాయి.

అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డిని సొసైటీ సభ్యులు కలిసి నాన్ అలాటీ జర్నలిస్టులందరికి వెంటనే ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు స్థలా లు ఇచ్చే విషయంలో పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. సొసైటీలకతీతం గా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో జర్నలిస్టులతో జరిగే సీఎం సభతో అందరు శుభవార్త వింటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యుల వినతికి అకా డమీ చైర్మన్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరంగా ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం సీఎంతో చర్చిస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో టీ శాట్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, సిరిగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, మురిపాల శ్రీనివాస్, శిగ శంకర్ గౌడ్, సునీత, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.