అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
కరీంనగర్, అక్టోబరు 22 (విజయక్రాం తి): రానున్న కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు సేవకుడిలా పనిచేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కు మద్దతు ప్రకటించాలని కోరారు. విద్యారంగ సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని, ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని చెప్పారు.