calender_icon.png 25 November, 2024 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు కృషి

29-10-2024 04:13:02 PM

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్..

సంగారెడ్డి (విజయక్రాంతి): పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కంది కొండాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని, అనారోగ్యాలకు గురైనప్పుడు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం చేయడం జరుగుతుందన్నారు. కొండాపూర్ మండలంలో 34 మందికి, కంది మండలంలో 29 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పిటిసి కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మసదన్ రెడ్డి, విట్టల్ నాయకులు, శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కృష్ణ గౌడ్, మోహన్ రెడ్డి, పాండు నగేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.