calender_icon.png 7 January, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఖ్యాతిని కాపాడేందుకు కృషి

02-11-2024 02:12:58 AM

  1. శాంతిభద్రతల పరిరక్షణకు పీస్ కమిటీలు సహకరించాలి 
  2. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ ఖ్యాతిని కాపాడేందుకు కృషి చేస్తున్నామని, నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పీస్ కమిటీ సభ్యులు అవిశ్రాంత కృషిని కొనసాగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.

నగరంలోని అన్ని జోన్‌లకు చెందిన పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల సభ్యులతో శుక్రవారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా హైదరాబాద్ పోలీసులకు మద్దతుగా ఉంటామని, సమాజంలోని సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి, ప్రజల్లో ఐక్యత నెలకొల్పే విధంగా కమ్యూనిటీ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తామని పీస్ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం నగరంలో ఇటీవల జరిగిన సున్నితమైన, మతపరమైన సమస్యలపై వారితో సీపీ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో శాంతిస్థాపనలో పీస్ కమిటీలది కీలక పాత్ర అన్నారు. పీస్ వెల్ఫేర్ కమిటీల్లో యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం పీస్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. నగరంలో కొంతమంది చేడు చేష్టల వల్ల దుష్పరిణామాలు కలిగాయని అన్నారు.

పీస్ వెల్ఫేర్ కమిటీలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు ఉండాలని, తద్వారా సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. పోలీసులు వివిధ మత సమూహాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిం చాలని, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరా రు.

సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ, సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ విక్రమ్ సింగ్‌మాన్, అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ ఎస్ చైతన్యకుమార్, సౌత్‌జోన్ డీసీపీ స్నేహమెహ్రా, డీసీపీలు, సెంట్రల్ పీస్ వెల్ఫేర్ కమిటీ జనరల్ సెక్రటరీ హఫీజ్ ముజాఫర్ హుస్సేన్, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.