calender_icon.png 24 November, 2024 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రానైట్ పరిశ్రమ పరిరక్షణకు కృషి

21-10-2024 12:20:43 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, ఆక్టోబర్ 20 (విజయక్రాంతి): గ్రానైట్ పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం ఖమ్మంలో జరిగింది.

ఈ సందర్భంగా మం త్రి తుమ్మల మాట్లాడారు. నూతన అధ్యక్షుడు పాటిబండ్ల యుగంధర్ మాట్లాడు తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అనంతరం మంత్రి తుమ్మలను, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను సన్మానించారు.

కార్యక్రమంలో ఉప్పల వెంకటరమణ, ఎమ్మెల్సీ తాతా మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.