నాగల్ గిద్ధ, ఫిబ్రవరి 6: బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జువేరియా తెలిపారు. గురువారం నాగల్ గిద్ధ మండలం కరస్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మిషన్ శక్తి, భేటీ బచావో భేటీ పడవో కార్యక్రమం నిర్వహించారు .
భారత ప్రభుత్వం దేశంలో లింగ వివక్షత, మహిళా సాధికారత సమస్యలను పరిష్కరించడానికి బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో అనే పేరు ’ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లను చదివించండి’ తెలిపారు.
ఈ పథకం లింగ పక్షపాతం నుండి ప్రజలకు అవగాహన కల్పించడం, బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు.
నాటిన మొక్కలను సంరక్షణ చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆసుపత్రి సూపర్ వైజార్ విక్టరీయా రాణి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పి.నర్సింలు, నర్సింగ్ ఆఫీసర్ సబిత కుమారి, అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.